Nizamabad: రోడ్డుపై వడ్ల కుప్ప మృత్యుపాశం.. ఇంటర్ ఫలితాల ముందే విద్యార్థిని బలి!

Nizamabad: రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇంటర్ విద్యార్థిని సింధుజ మృతి చెందింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 10:20 AM IST
Nizamabad
X

Nizamabad: రోడ్డుపై వడ్ల కుప్ప మృత్యుపాశం.. ఇంటర్ ఫలితాల ముందే విద్యార్థిని బలి!

రెంజల్/బోధన్: వడ్ల కుప్పను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. గురువరమైన తెలిపిన కథనం ప్రకారం బోధన్ మండలం పెద్దమందికి చెందిన ఆవుల గంగా ప్రసాద్ అదే గ్రామానికి చెందిన పులిసిందూజ( 17) అనే విద్యార్థిని కలిసి ద్విచక్ర వాహనంపై ఈనెల మూడున పెగడపల్లిలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ జాతరకు వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి సంతూర్ కి వెళ్తుండగా రెంజల్ మండలం సాటాపూర్ శివారులో రోడ్డుపై నిల్వ ఉంచిన వడ్ల బస్తాల ను వారి వాహనం ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా చికిత్స నిమిత్తం జిజిహెచ్ కూ తరలించారు. సింధుజ పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నీమ్స్ దావఖానకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం వచ్చింది అని ఎస్ఐ తెలిపారు.

ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన సింధుజ : ఇటీవల ఇంటర్ పరీక్షలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినట్లు సింధు తల్లి లావణ్య పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు వెలువడుతున్న తరుణంలో తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి శోకసముద్రంలో మునిగి తేలింది. గ తేడాది ఏప్రిల్ 2న తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడని ప్రస్తుతం తల్లి సోదరుడి తో సింధుజ ఉంటుందని పెద్ద మంది గ్రామస్తులు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story