Nizamabad: SIR ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ ఆదర్శం!
Nizamabad: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
Nizamabad: SIR ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ ఆదర్శం!
Nizamabad: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఈ విజయానికి బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), కాంగ్రెస్ శ్రేణుల కృషియే కారణమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులోని అమృత్ గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి SIR సమీక్ష సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్‌లో SIR ప్రక్రియ సమర్థవంతంగా అమలవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అభినందించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమన్నారు.బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించిందని, ఆ వైఖరికి దేశవ్యాప్తంగా గట్టి గుణపాఠం లభించిందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థుల గొంతుకగా నిలబడి వారి సమస్యలపై పోరాడారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడకుండా బీజేపీ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గట్టి సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.
ఎంపీ అరవింద్ మాటలు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నియోజకవర్గ SIR సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, తారాచంద్ నాయక్, భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు అంబర్ సింగ్, సర్పంచ్ ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు వాసు, అమృతాపూర్ గంగాధర్, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




