Edapalli: అశోక్ సాగర్ చెరువులో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య
Edapalli: నిజామాబాద్ అస్మీ కాలనీకి చెందిన ఇమ్రాన్ బేగం, ఆమె కూతురు కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది అశోక్ సాగర్ చెరువులో ఆత్మహత్య చేసుకున్నారు.
Edapalli: అశోక్ సాగర్ చెరువులో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య
ఎడపల్లి: చిన్నపాటి కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది తల్లి కూతురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగు చూసింది. బోధన్ గ్రామీణ సిఐ విజయ్ బాబు కథనం ప్రకారం... నిజామాబాద్ పట్టణం అస్మీ కాలనీకి చెందిన ఇమ్రాన్ బేగం(32) గృహిణిగా ఉన్నారు. భర్త ఆసిఫ్ దుబాయ్ లో ఉంటున్నారు.
వీరికి నాలుగు సంవత్సరాల వయసు గల కూతురు ఉంది. కొంతకాలంగా ఇమ్రాన్ బేగం ఇంట్లో అన్యమనస్కంగా ఉంటున్నారు. చిన్నపాటి కారణంతో మనస్థాపానికి గురైన ఆమె తన కూతురును తీసుకొని బయలుదేరింది. తాను ఎస్ ఐ ఆర్ ఫారం నమోదు చేసుకుని వస్తానని ఇంట్లో చెప్పి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది.
ఆ తర్వాత ఫోను స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జానకంపేట గ్రామ అశోక్ సాగర్ చెరువులో తల్లి కూతురు శవమై తేలారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు విజయ్ బాబు వివరించారు.




