Nizamabad: 1.05 కోట్ల మందికి డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు ఎమ్మెల్యే!

Nizamabad: 1.05 కోట్ల మందికి డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని, లబ్ధిదారుల వివరాలు Telangana EPDS Portal ద్వారా అందుబాటులో ఉంటాయని MLA తెలిపారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 15 Aug 2026 9:46 AM IST
Nizamabad: 1.05 కోట్ల మందికి డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు ఎమ్మెల్యే!
X

Nizamabad:1.05 కోట్ల మందికి డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు ఎమ్మెల్యే!

Nizamabad: ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా ఆ దిశగా మరో కీలక అడుగు పడుతోందని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. కాగితపు రేషన్ కార్డుల స్థానంలో PVC డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడం ద్వారా నకిలీ కార్డులకు అడ్డుకట్ట వేయడంతో పాటు, లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

కొత్త లబ్ధిదారులతో సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1 కోటి 5 లక్షల మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ వ్యవస్థలను ఆధునీకరించడంలో విఫలమైందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ద్వారా ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు చేరువ అవుతున్నాయని అన్నారు... బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అనవసర రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, బాల్ రాజు, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమ్మాజి నరేష్, రాంచందర్ గౌడ్, బోర్గం శ్రీనివాస్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story