Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఆడ శిశు విక్రయం కలకలం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎంషాలో బిడ్డ చనిపోయిందని నమ్మించి ఆడ శిశువును విక్రయించిన ఘటన 1098 ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

K RAVI, BODHAN
Published on: 9 Sept 2026 11:15 AM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఆడ శిశు విక్రయం కలకలం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఎంషా గ్రామంలో ఆడ శిశువును విక్రయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యం చ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి మూడో సంతానం ఆడ శిశువుకు మహిళా జన్మనిచ్చింది.

ముందు రెండు కాన్పుల్లో ఇద్దరు మగ సంతానం ఉన్నప్పటికీ సదరు మహిళ కుటుంబ సభ్యులు వారి సమీప బంధువులైన బైంసా చెందిన వారికి లక్ష20 వేలకు విక్రయించారు. మహిళ తన కూతుర్ని ఇప్పించాలని భర్తతో గొడవ పడింది విషయాన్ని 1098కు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ బృందం శిశు విక్రయం పై విచారణ చేపట్టారు.

శిశువును విక్రయించిన వాస్తవమేనని తమ సమీప బంధువులకే ఇరువురు ఒప్పందం మేరకు శిశువుని విక్రయించినట్లు శిశు తండ్రి పోలీసుల ముందు వెల్లడించారు. ఈ విషయమై ఇద్దరు అంగీకారం ప్రకారం విక్రయించామని భర్త ఒప్పుకోవడం గమనర్వం.

యం చాలో శిశు విక్రయంపై ఆరా తీయగా సదరు కుటుంబానికి సంబంధించిన బంధువులు శిష్యుని కొనుగోలు చేసేందుకు ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకున్నారని ఆసుపత్రిలో ఖర్చులకు సైతం ముందుగానే డబ్బులు వెచ్చించారని విచారణలో వెళ్లడైంది.

సదర్ మహిళా జిల్లా కేంద్రంలో కాన్పు చేసుకొని యం చ కు వచ్చినప్పటికీ పుట్టిన బిడ్డ మరణించింది అని స్థానిక ఆశ వర్కర్ కు, అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇవ్వడంతో సదరు సిబ్బంది శిశు మరణించినట్లు రికార్డులో నమోదు చేసుకున్నారు.

తిరిగి తన కూతుర్ని ఇప్పించాలని 1098 ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు తెలుగులోకి వచ్చాయి. బైంసా నుండి ఆడ శిశువును నవీపేట్ పోలీసులు తెప్పించి శిశు సంక్షేమ శాఖకు అప్పగించినట్లు ఎస్సై శ్రీకాంత్, సూపర్వైజర్ విశాలాలు వెల్లడించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story