Nizamabad: అల్లాడుతున్న మూగజీవాలు.. వైరల్ పిక్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లో భానుడి భగభగలకు తట్టుకోలేక ఓ కుక్క నీళ్ల ట్రబ్బులో దూరి సేదతీరింది.
Nizamabad: అల్లాడుతున్న మూగజీవాలు.. వైరల్ పిక్!
Nizamabad: మండుతున్న ఎండల తీవ్రత మనుషులనే కాదు మూగజీవాలను కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఓ శునకం నీటితో నిండిన ట్రబ్బులోకి దిగిపోయి సేదతీరుతున్న దృశ్యం స్థానికులను కదిలించింది.
భగభగ మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండగా, మూగజీవాలు కూడా నీటి కోసం అల్లాడుతున్నాయి. చల్లదనం కోసం ఆ శునకం ట్రబ్బులో కూర్చొని ఉపశమనం పొందడం అక్కడున్న వారిని ఆలోచనలో పడేసింది.
వేసవి కాలంలో పక్షులు, జంతువుల కోసం ఇళ్ల ముందు నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఎండల తీవ్రతకు మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story




