Nizamabad: నిజామాబాద్‌లో రణరంగం.. హైవేపై రైతుల భారీ ధర్నా!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతుల భారీ ధర్నా.
Nizamabad: నిజామాబాద్‌లో రణరంగం.. హైవేపై రైతుల భారీ ధర్నా!
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి )గ్రామం లో ధాన్యం కొనుగోలు చేయాలనీ జాతీయ రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేసిన రైతులు..గత 20 రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. రెండు కిలోమీటర్ల వరకు నిలిచి పోయిన వాహనాలు..వాతవరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఒకవైపు భయం మరో వైపు 20 రోజులుగా ధాన్యం కుప్పల వద్ద రైతులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతులు చివరకు విసుకు చెంది ప్రధాన రహదారి పై ధర్నాకు దిగటంతో ఇరు వైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు, తాసిల్దార్, సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. త్వరగా ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చూస్తామని హామి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.




