Nizamabad: చేతికొచ్చిన పంట రాలిపోయె.. అప్పుల ఊబిలో కౌలు రైతులు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో అకాల వర్షం, వడగండ్ల వాన బీభత్సం. హుంసా, ఖాజాపూర్, మందర్నా గ్రామాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం.
Nizamabad: చేతికొచ్చిన పంట రాలిపోయె.. అప్పుల ఊబిలో కౌలు రైతులు!
నిజామాబాద్ జిల్లా: బోదన్ నియోజకవర్గ పరిధిలోని సాలూరు మండలంలో శనివారం రాత్రి వడగండ్ల వాన కురియడంతో వివిధ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షం రైతులను నిండా ముంచేసింది. మండలంలోని హుంసా, ఖాజాపూర్, మందర్నా గ్రామ శివారులో వడగండ్లతో కూడిన వర్షం కురడంతో చేతుకొచ్చిన వరి పంట, మామిడి పంటలు బాగా నష్టపోయాయి. కోత దశలో ఉన్న వరి రైతుకు ఊరే మిగిలింది. సుమారు 1000 ఎకరాల్లో వరి పంట రాళ్లవానకు దెబ్బతింది. వడగండ్ల వాన కురియడంతో దాన్ని పూర్తిగా రాలిపోయి పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి కొద్ది రోజుల్లో చేతికొచ్చిన పంటను కోసి వచ్చిన ధాన్యాన్ని విక్రయించి అప్పులు తీరుద్దాం అనుకున్న రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. రైతుల ఆశలపై అకాల వర్షం పిడుగుల దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందర్నా లో ఇసుక తుఫాన్ తో కూడిన ఈదురుగాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఇసుక తుఫాన్ చె లరెగడం తో కుసి పోటీలను వదిలేసి ఇళ్లల్లోకి పరుగులు తీశారు. ఈదురు గాలులు రాళ్లవానకు మామిడి పంట 100 ఎకరాల్లో నే లమట్టమయ్యింది. మామిడి తోటలను కౌలుకు తీసుకున్న వ్యాపారస్తులకు సైతం భారీగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోతున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధిత రైతులు వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కౌలు రైతులకు భారీ నష్టం : ఎకరాకు 32 బస్తాల చొప్పున కౌలు ఒప్పందం కుదుర్చుకొని వ్యవసాయం చేస్తున్నామని కౌలు రైతులు పేర్కొన్నారు. వడగండ్ల వాన అకాల వర్షంతో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలమట్టమవ్వ డంతో పెట్టుబడి తెచ్చిన అప్పులు, పట్టాదారుకు చెల్లించాల్సిన కౌలును ఎలా తీర్చాలని కౌలు రైతులు కన్నీళ్ల పర్యంతమౌతున్నారు.




