Nizamabad: నిజామాబాద్ వానల కోసం రైతుల సప్త భజనలు
Nizamabad: నిజామాబాద్ జిల్లా రాంపూర్ గ్రామంలో వర్షాల కోసం రైతుల ప్రత్యేక భజనలు. పంటలు ఎండిపోతుండటంతో వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు సంప్రదాయ పూజలు.
Nizamabad: నిజామాబాద్ వానల కోసం రైతుల సప్త భజనలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నప్పుడు, వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు భజనలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో, వర్షాల కోసం గ్రామస్తులు శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా సప్త భజనలు చేస్తున్నారు.
భక్తులు ఐదు బృందాలుగా విడిపోయి నిరంతరం ఈ భజనలు నిర్వహిస్తున్నారు.గ్రామ దేవతలకు పూజలు వర్షాలు లేక వరి పొలాలు ఎండిపోతుండటంతో గ్రామం లో భజనలు చేస్తున్నారు. భూమి తడిస్తేనే రైతుల కళ్లలో ఆనందం ఉంటుందని, వానలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుకుంటూ ఇలాంటి సంప్రదాయ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
ఐదు బృందాలుగా ఏర్పడి సప్త భజన కార్యక్రమం చేపడుతున్నారు. వీరు వరుసగా ఏడు రోజులు వర్షం కోసం నాన్ స్టాప్ గా భజనలు చేస్తారని గ్రామస్తులు తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి సప్త భజన చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు.




