Nizamabad: వర్షాభావ పరిస్థితులు పంటలను కాపాడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన... మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో డ్రై స్పెల్ కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టుల ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

M. RAMESH,NIZAMABAD
Updated on: 1 Sept 2026 8:42 PM IST
Nizamabad
X

Nizamabad: వర్షాభావ పరిస్థితులు పంటలను కాపాడాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన... మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతి,జిల్లాలోని ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు (డ్రై స్పెల్) నీటి ఎద్దడి కారణంగా బోర్లు, అరకొర నీటి ఆధారంగా కష్టపడి నాట్లు వేసుకున్న రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. పంటలు ఎండిపోకుండా కాపాడటానికి తక్షణమే నీటి విడుదల అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత నీటి లభ్యత:

నిజాంసాగర్ ప్రాజెక్టు: సుమారు 16 - 17 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.ఎస్ఆర్ఎస్పీ (SRSP) ప్రాజెక్టు: సుమారు 46 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

చేయవలసిన తక్షణ చర్యలు:

అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్: పైన తెలిపిన ప్రాజెక్టులలో తగినంత నీరు ఉన్నందున, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా గాని నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గాని నిజామాబాద్ మాసాని ఆయకట్టు పరిధిలోని రైతులకు తక్షణమే నీటిని విడుదల చేయాలి.నీటిపారుదల శాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వాలి కాలువల ద్వారా నీటిని త్వరగా పంట పొలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలి.

DIDAB/ఇరిగేషన్ సమావేశం: పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే జిల్లా ఇరిగేషన్ డెవలప్‌మెంట్ ఎడ్వజరి సమావేశాన్ని (Irrigation Advisory Committee Meeting) ఏర్పాటు చేసి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలి.ప్రభుత్వం కూడా మీకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోమని చెప్పింది. పంటలు ఎండిపోకముందే స్పందించి, ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి నీరు అందేలా తగిన చర్యలు తీసుకుని జిల్లా రైతాంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story