Armoor: ఆర్మూర్‌లో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో అధికమాసం సందర్భంగా నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ వైభవంగా జరిగింది.

VAMSHI, ARMOOR
Published on: 12 Jun 2026 6:22 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

Armoor: జిల్లా ఆర్మూర్ పట్టణ క్షత్రియ ఫంక్షన్ హాల్ లో అధికమాసం సందర్భంగా శ్రీ నాగేష్ శర్మ గురు స్వామి తన సొంతంగా అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. ఈ మహా పడిపూజలో ఎవరైతే అయ్యప్ప మాల ధారణ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుమారు 100 స్వామి దంపతుల కు గురుస్వామి ఆధ్వర్యంలో సత్కారం.

ఈ సందర్భంగా నగేష్ శర్మ గురుస్వామి మాట్లాడుతూ ఈరోజు అయ్యప్ప మహా పడిపూజ ఫంక్షన్ హాల్ లో నిర్వహించి, మణికంఠుడికి అభిషేకం చేస్తూ, మెట్లు ముట్టిచ్చి, హారతి , అధికమాసం ము అధికస్తే అధిక బలం అంటూ, ఈ మాసంలో ఎలాంటి పూజ కార్యక్రమాలు గాని, దానధర్మాలు కానీ, గంగ సానాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే అనంత కోటి ఫలితాలు వస్తాయని మన శాస్త్ర ప్రకారంగా ఈరోజు అధికమాసం పురస్కరించుకొని, మహా పడిపూజ,

ఎవరైతే గురు స్వామీలు 18 సంవత్సరాలు పూర్తి చేశారు ,99 కుటుంబ దంపతులకు సన్మానించడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి పాల్గొనందున పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి మన ఒక జిల్లా కాకుండా, ఇతర నిర్మల్ జిల్లా నుంచి, ఆదిలాబాద్, బైంసా, హైదరాబాద్, ఆర్మూర్ ఆర్మూర్ మండల్ నుంచి వచ్చిన స్వాములకు కూడా పేరుపేరునా ధన్యవాదములు, అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని, స్వామివారి అన్నప్రచారం అందరూ అర్చన భక్తులు స్వీకరించాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షుడు, కార్యదర్శి, ధనంజయ స్వామి, శ్రీహరి స్వామి, సురేష్ స్వామి, ఉదయ స్వామి, విజయ స్వామి,స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story