Nizamabad: మహిళను చంపి.. గ్రామస్థుల చేతిలో దెబ్బలు తిని వ్యక్తి మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Nizamabad: మహిళను చంపి.. గ్రామస్థుల చేతిలో దెబ్బలు తిని వ్యక్తి మృతి
Nizamabad: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. వాళ్ల సంతోషం కోసం పిల్లల్ని, తల్లిదండ్రులని చివరికి కట్టుకున్న భార్య భర్తలను దూరం చేస్తున్నాయి. ఫలితం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది . మామిడిపల్లి తాండకు చెందిన ఆనంద్. వర్ని మండలం పొట్టి గుట్ట తాండకు చెందిన సుజ్జి బాయి తో ఆనంద్ గత కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.
మంగళవారం పొట్టి గుట్ట తండాలో పాతులోత్ కవిత ఇంటి వద్ద ఆనంద్ కు కవిత తో మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆనంద్ ఆవేశం పెంచుకొని పదునైన వ్యవసాయ పనిముట్టుతో( పార) తో పాతులోత్ కవిత పై దాడి చేయగా తీవ్ర గాయాలకు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తెలుసుకున్న లకావత్ ఆనంద్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మృతురాలి కుటుంబ సభ్యులు,
లకావత్ ఆనంద్ ను వెంబడిస్తూ రాళ్లతో కొట్టగా తీవ్ర గాయాల గురై పొలంలో అపస్మార్క స్థితిలో పడి ఉండగా, వర్ని ఎస్సైభాస్కరా చారి పరిశీలించి ఆనంద్ బతికి ఉన్నాడని పొతంగల్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా వాళ్ళు తక్షణం సంఘటన స్థలానికి చేరుకొని ఆనంద్ ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆసుపత్రి వద్దకు రాగానే మృతి చెందాడు. ఇద్దరూ మృతి చెందడం పట్ల వర్ని పోలీసులు అసలు వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.




