Nizamabad: కాంగ్రెస్ ధర్నా – రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ ఖండన!
Nizamabad: డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నిరసన. విద్యార్థుల వైపు నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్ట్‌పై నాయకుల మండిపాటు.
Nizamabad: కాంగ్రెస్ ధర్నా – రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ ఖండన!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి రైల్వే స్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ధర్నా చేపట్టారు... విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని డిచ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబర్ సింగ్, డిసిసి ప్రధాన కార్యదర్శి పోలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు గళమెత్తితే వారి గొంతు నొక్కడం సరికాదు అని పేర్కొన్నారు.. ధర్నా లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో డీసీసీ ప్రధాన కార్యదర్శి పోలసాని శ్రీనివాస్,రూరల్ నియోజకవర్గ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వాసు, సొసైటీ చైర్మన్లు రాంచందర్ గౌడ్, రామకృష్ణ, మాజీ ఎంపీపీ సీహెచ్.నర్సయ్య, డీసీసీ కార్యదర్శులు డాక్టర్ షాదుల్లా, డాక్టర్ జహూర్, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, సర్పంచులు తోటభాస్కర్, కోట్ల భాస్కర్, ప్రభాకర్, సుదాం శ్రీనివాస్, లక్ష్మణ్, రవికిరణ్, గోవర్ధన్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజన్న, మైనార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం, బుస సుదర్శన్,ఎ.జీ దాస్ , సుమన్, పాల్గొన్నారు.




