Nizamabad: రుద్రూర్ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం!

Nizamabad: రుద్రూర్‌లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మపాలు అమృతతుల్యమని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ విద్య పేర్కొన్నారు.

SALEEM, BANSWADA
Published on: 1 Aug 2026 5:39 PM IST
Nizamabad
X

Nizamabad: రుద్రూర్ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం!

జిల్లా: నిజామాబాద్

తల్లిపాలే బిడ్డకు అమృతం...రుద్రూర్ లో తల్లిపాల వారోత్సవాలు.

పుట్టిన బిడ్డకు గంటలోపే మురూ పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశ్యమని, తల్లిపాలే బిడ్డకు అమృతం అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విద్య అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు కొనసాగుతాయని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విద్య మాట్లాడుతూ.. అమ్మపాలు అమృతమని, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయని అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయన్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అపోహలు వీడి తప్పకుండా బిడ్డకు పాలు పట్టించాలని తెలిపారు. పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయని, అందుకే తల్లిపాలను అమృతంతో పోలుస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శృతి, ఎంపీడీవో బాలగంగాధర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డా. అయోషా సిద్ధిక, ఎంపీడీవో బాల గంగాధర్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story