Bodhan: షుగర్ ఫ్యాక్టరీ పోరాట నేతలకు ఊరట కల్పించిన కోర్టు

Bodhan: బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కేసులో ఉద్యమ నేతలకు పెద్ద ఊరట. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసులను కొట్టివేసిన బోధన్ కోర్టు.

K RAVI, BODHAN
Published on: 29 May 2026 5:08 PM IST
Bodhan
X

Bodhan: షుగర్ ఫ్యాక్టరీ పోరాట నేతలకు ఊరట కల్పించిన కోర్టు

బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశంలో కేసులు నమోదైన పలువురు నేతలకు శుక్రవారం బోధన్ కోర్టు ఊరట కల్పించింది. 2018 లో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న నేతలు ఫ్యాక్టరీ అంశంపై 200 రోజులపాటు సామాజిక తెలంగాణ పార్టీ నాయకుడు ఉప్పు సంతోష్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు దీక్షలు చేపట్టారు. ఫ్యాక్టరీని తెరిపించాలని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలు తెలిపినందుకు అట్టి నేతలపై అక్రమ కేసులను నమోదు చేసినట్లు కోర్టులో నిర్ధారణ అయింది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేదని శాంతియుతంగా దీక్షలు చేసిన ఫ్యాక్టరీ నేతలపై కేసు నమోదు చేయడంతో 8 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ నేతలు తిరిగారు. ఎట్టకేలకు పోలీసులు సరైన సాక్షాధారాలు ప్రవేశపెట్టకపోవడంతో బీర్కూరు శంకర్, మల్లేష్, వరదయ్య, ఏశాల గంగాధర్, రాఘవులు, కొమ్ముల గంగాధర్, జె శంకర్, రాములు సాయిలు యాదవ్ గోపి ల పై నమోదైన కేసులను కోర్టు కొట్టు కొట్టి వేయడంతో ఉద్యమ నేతలు బోధనలో సంబరాలు జరుపుకున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story