Kamareddy: నీట్ లీకేజీపై భగ్గుమన్న కాంగ్రెస్..
Kamareddy: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు డిమాండ్ చేశారు.
Kamareddy: నీట్ లీకేజీపై భగ్గుమన్న కాంగ్రెస్..
కామారెడ్డి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా, రాస్తారోకో.
నిజాంసాగర్ (కామారెడ్డి) ఏ ఐ సి సి నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిజాంసాగర్ మండలం మంగ్లుర్ గేట్ వద్ద 161 జాతీయ రహదారిపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమం లో డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, జుక్కల్ నియోజకవర్గం లోని మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఏ ఐ సి సి, టి పి సి సి అధ్యక్షుల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం మంగ్లుర్ గేట్ వద్ద 161 జాతీయ రహదారిపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమం లో డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.
పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ తమ పార్టీ ఏ ఐ సి సి నాయకుడు రాహుల్ గాంధీ సహా ఇతర నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏ ఐ సి సి, టి పి సి సి అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం లో భాగంగా కామారెడ్డి జిల్లా డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటమాడిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని,నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమం లో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నియోజకవర్గం లోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, సర్పంచ్లు, పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.




