Madnoor: మద్నూర్ శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయం

Madnoor: మద్నూర్‌లో 80 ఏళ్ల నాటి తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి భూ పరిశీలన. స్థలం సర్వే చేయించిన తహసీల్దార్ ఎం.డి. ముజీబ్.

VEERANNA, JUKKAL
Published on: 11 July 2026 4:05 PM IST
Madnoor
X

Madnoor: మద్నూర్ శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయం

మద్నూర్: మద్నూర్ (కామారెడ్డి) దాదాపు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన మైన మద్నూర్ మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయ భవనం శిధిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి గాను భూ పరిశీలన చేపట్టినట్లు మద్నూర్ తహసిల్దార్ ఎం డి ముజీబ్ తెలిపారు. మద్నూర్ రెవెన్యూ కార్యాలయ కార్యకలాపాలు , జుక్కల్ నియోజక వర్గ ఎన్నికల నిర్వహణ, సామాగ్రి భద్రపరచడం లాంటివి ఈ భవనంలోనే కొనసాగుతున్నాయి.

గతంలో పలుసార్లు భవన పెచ్చులు ఊడి కార్యాలయ సిబ్బంది పై పడడంతో స్లాబ్ పైన రేకులు కొట్టించి నెట్టుకొచ్చారు. ప్రస్తుతం రెవెన్యూ సేవలు, ఎన్నికల నిర్వహణ, సామాగ్రి భద్రపరచడం కష్టంగా మరి భవనం శిధిలావస్థకు చేరడంతో జిల్లా కలెక్టర్ కు తహసిల్దార్ నివేదించడంతో కలెక్టర్ స్పందించి కార్యాలయ నిర్మాణానికి మంజూరు చేయడంపట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా శిధిలావస్థకు చేరిన, అద్దె భవనాల్లో ఉన్న వాటికి రాష్ట్ర వ్యాప్తంగా 125 తహసిల్దార్ కార్యాలయాలు, 11 ఆర్ డి ఓ నూతన కార్యాలయలు నిర్మించనున్నారని ఇందుకు గాను మద్నూర్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అనువైన స్థలాన్ని సర్వే చేయించారు. కార్యక్రమం లో సర్వేయర్ వెంకట్, జూనియర్ సహాయకులు రవి కుమార్, లైసెన్స్ సర్వేయర్ అనిల్, చైన్ మెన్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story