Nandipet: నందిపేట్ మోడల్ స్కూల్ విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్

Nandipet: నిజామాబాద్ నందిపేట్ మోడల్ స్కూల్‌లో జాతీయ స్థాయి ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన నలుగురు విద్యార్థులను, ఎమ్మెల్యే పైడి రాకేశ్ ఘనంగా సన్మానించారు.

VAMSHI, ARMOOR
Published on: 18 Jun 2026 4:36 PM IST
Nandipet
X

Nandipet: నందిపేట్ మోడల్ స్కూల్ విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్

నందిపేట్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు జాతీయస్థాయి స్కాలర్షిప్ లో తమ ప్రతిభ కనపరిచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శాలువా, పూలమాలతో ఘన సన్మానం.

ఈ కార్యక్రమానికి స్కూల్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, తన తోపాటు నందిపేట్ సర్పంచ్, మండల్ ఎంపీడీవో, ఎంఈఓ, మండల బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కోవి ప్రవీణ్ కుమార్:

ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మన పాఠశాలకు ఎమ్మెల్యే రావడం చాలా ఆనందం,మా మోడల్ స్కూల్ విద్యార్థులకు హిస్టరిక్ అచీవ్మెంట్ నేషనల్ లెవెల్ NNMS స్కాలర్షిప్ కు నలుగురు బ్రిలియంట్ విద్యార్థులు గా సెలెక్ట్ కావడం నాకు చాలా గౌరవంగా ఉండి అంటూ, విద్యార్థులకు ఒక సంవత్సరానికి 12000 చొప్పున నాలుగు సంవత్సరాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 48000 వేల రూపాయలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు మాటలు విని, ఇతర విద్యార్థులు చక్కగా చదువుకొని, పిల్లలాగా మంచిగా టాపర్స్ గా రావాలని కోరుతూ, ఇంకా మిగతా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించి ప్రైవేట్ స్కూళ్లను వదిలేసి, చక్కగా సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు.

నలుగురు విద్యార్థుల వివరాలు:

నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ నలుగురు విద్యార్థుల ఎంపికైన వివరాలు, చేపూరి శ్రీలత, పనేం హర్షిత, గొల్లపల్లి అలంక్రిత, రచ్చ కనిష్క వీళ్లంతా 8వ తరగతి

నియోజవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి:

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ రకంగా టాపర్స్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, అంటూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి మంచి ఉపాధ్యాయులు, మంచి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి, దీన్ని దృష్టిలో పెట్టుకొని కావున తల్లిదండ్రులకు పిల్లలు ఉన్న వారంతా ప్రైవేట్ స్కూల్ ను వదిలేసి,

ఇలా ప్రభుత్వ మాడల్ స్కూల్ పాఠశాలలో చదివించాలని కోరారు, పిల్లలందరూ పాఠశాల పుస్తకాల మీద దృష్టి పెట్టాలి, మొబైల్ ఫోన్స్ ఎవరు కూడా చూడకండి, కావున దాన్ని అలా చేయడం మానేసి, చక్కగా చదువుకొని ఆ స్కూల్ కి మంచి పేరు తేవాలన్నారు, రాష్ట్రంలో ఇప్పటివరకు పదివేల స్కూల్లో మూతపడ్డాయి, ఇలా బందు కావడంతో ఎన్ని లక్షల 50 వేల పిల్లలు మిగిలిపోయారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలా స్కూలు బంద్ అవుతే నీ పరిస్థితి ఏమైతుందో గమనించాలి, పిల్లలకు పాటలు చెబుతూ మంచి ర్యాంకులు తెప్పించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నందిపేట్ గ్రామ సర్పంచ్, బీజేపీ మండల ప్రెసిడెంట్,నాయకులు కార్యకర్తలు, మండల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story