Kamareddy: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా!
Kamareddy: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు (CITU) ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. అధికారుల వేధింపులు ఆపాలంటూ నిరసన.
Kamareddy: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో కార్మికులు ధర్నా చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కరోజు ఆలస్యం అయినా వారం రోజుల పాటు పనిలోకి తీసుకోవడం లేదన్నారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పనిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద చెత్త సంచులు ఆటోలో వేస్తున్న కార్మికునిపై కమిషనర్ చెప్పుకోలేని భాషలో బూతు పురాణం అందుకున్నారన్నారు. జవాన్ తో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారన్నారు. షాప్ వ్యక్తికి జరిమానా వేయాలని, చెత్త తోసుకోవద్దనో కమిషనర్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల పట్ల అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు.




