Madnoor: మద్నూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. తల్లి, కొడుకు దుర్మరణం!

Madnoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం 161 జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు.

VEERANNA, JUKKAL
Published on: 23 May 2026 11:24 AM IST
Madnoor
X

Madnoor: మద్నూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. తల్లి, కొడుకు దుర్మరణం!

మద్నూర్: సమీప బంధువు మృతి చెందడం తో కర్మకాండ కు తిరిగి ఇంటికి పయనమైన తల్లి, కొడుకులను మృత్యువు కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిన ఘటన మద్నూర్ మండలం 161 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పక్క ప్రాంతమైన మహారాష్ట్ర దేగ్లూర్ తాలూకా షాపూర్ గ్రామానికి చెందిన తల్లి గండ్ల వార్ శేష బాయి (65) కొడుకు గండ్ల వార్ పండరి లు మద్నూర్ మండలం.

మేనుర్ గ్రామంలో సమీప బంధువు కర్మకాండ కు వచ్చి ద్విచక్ర వాహనం పై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మద్నూర్ సమీపంలోని 161 జాతీయ రహదారి ప్రమాదవశాత్తు సర్వీస్ రోడ్డు డి వైడర్ ను ఢీకొనడంతో తల్లి శేష బాయి అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు పండరిని చికిత్స కోసం దెగులూర్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ లో వెల్లడైనట్లు మద్నూర్ ఎస్సే మోహన్ రెడ్డి తెలిపారు.మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story