Jukkal: నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చొరవతో జుక్కల్ నుండి కాంగ్టి వరకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభమైంది.

VEERANNA, JUKKAL
Published on: 20 Jun 2026 1:02 PM IST
Jukkal
X

Jukkal: నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

జుక్కల్ (కామారెడ్డి): జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రత్యేక చొరవతో జుక్కల్ మండల కేంద్రం నుండి పక్క జిల్లా సంగారెడ్డి జిల్లా కాంగ్టి మండలం వరకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభమైంది. బాన్సువాడ డిపోకు చెందిన ఈ బస్సు సర్వీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు జుక్కల్ మండలం సవర్గవ్ గ్రామంలో నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించారు.

ఈ బస్సు ప్రతి రోజు ఖండే బల్లూర్, సవర్గవ్, లింగంపల్లి, విఠల్ వాడి మీదుగా ఖంగ్టి వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. బస్సు సర్వీస్ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించడమే లక్ష్యమన్నారు.

గతంలో బాన్సువాడ డిపోకు చెందిన బస్సు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం బిచ్కుంద నుండి విఠల్ వాడి వరకు కొనసాగేదని దాన్ని గత 20 సంవత్సరాల క్రితం రద్దు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు ప్రమాదమని తెలిసిన తప్పని పరిస్థితి లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి రాకపోకలు సాగించే వారని ఈ రాకపోకల కారణంగా పలు సార్లు ప్రైవేటు వాహనాలు మూల మలుపు వద్ద అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటన ను అనేకం ఉన్నాయని ఇటీవలే కొందరు జుక్కల్ ఎమ్మెల్యే ను ఆశ్రయించి తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే బాన్సువాడ డి ఎం తో సంప్రదించి బస్సు సర్వీస్ ను కల్పించాలనడంతో ఈ బస్సు సర్వీస్ ను ప్రారంభించారు.

నూతన బస్సు సర్వీస్ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తోపాటు పలు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కొద్ది దూరం వరకు బస్సులో ప్రయాణించారు. తమ చిరకాల కోరిక ను నెరవేర్చి నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించేలా కృషి చేసిన ఎమ్మెల్యే కు ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో సతీష్ పాటిల్, ఆయిల్వర్ రమేశ్, సర్పంచ్ పోరం మండల అధ్యక్షుడు చాకలి కృష్ణ, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ కె. సాయగౌడ్, మాజి సర్పంచ్ బి. రాములు సెట్, జగుర్శింగ్, ఇమ్రాన్, పీరాజి, గంగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story