Nizamabad: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

SALEEM, BANSWADA
Published on: 6 Aug 2026 5:32 PM IST
Nizamabad
X

Nizamabad: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, నాలుగు బండ్లలో భాగంగా మొదటి బండ్ నిర్మాణంలో రెండు స్లూయిస్ (తూములు) నిర్మాణం పూర్తిగా పూర్తి అయినట్లు తెలిపారు.

ఈ నిర్మాణాల వల్ల గతంలో సిద్దాపూర్ చెరువులో నిల్వ ఉండే నీటి పరిమాణంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రెట్టింపు స్థాయిలో నీటి నిల్వ సాధ్యమైందని, కట్ట ఎత్తు సుమారు ఐదు మీటర్లు పెరగడంతో రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని

దీని ఫలితంగా సిద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా, ఆయకట్ట పరిధిలోని వ్యవసాయ భూములకు వానాకాలం మరియు వేసవి పంటలకు తగినంత నీరు ఇప్పటికే నిల్వ ఉండడంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.

నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన తరువాత సిద్దాపూర్ రిజర్వాయర్ ఆయకట్ట పరిధిలోని సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు.ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story