Armoor: హిందువులంతా ఏకమవ్వాలి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపు
Armoor: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా ఫతేపూర్, గోవింద్పేట ఆలయాలను సందర్శించారు.
Armoor: హిందువులంతా ఏకమవ్వాలి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపు
ఆర్మూర్ న్యూస్: హనుమాన్ జయంతి సందర్భంగా నియోజవర్గంలో పలు ఫతేపూర్, గోవింద్ పెట్ గ్రామం, పట్టణంలో ఉన్న హనుమాన్ మందిరాలు ను దర్శించుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్చకులు హనుమంతుడు కి హారతి ఇచ్చి, అక్షింతలు తో ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేకంగా హిందువులందరికీ, హెచ్ఎంటీవీ ఛానల్ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు,
సుమారు ఒక్కొక్క గుడిలో వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు, ఇది మన భవిష్యత్తు తరాలకు నిలిచిపోతుంది, ఇదంతా మన పెద్దవాళ్లు చేసిన ధర్మం, కావున హిందువులందరూ సంవత్సరానికి వచ్చే పండుగ అన్న ప్రసాదం స్వీకరించడమే కాకుండా, ప్రతినిత్యం 365 రోజులు నిత్యం గుడికి వెళ్లి ఆలయాలను దర్శించుకోవాలంటూ, మన దేవాలయాలని మనం కాపాడుకుందాం, ఇవన్నీ భవిష్యత్తులో మన పిల్లలకు పిల్లలకు నిలిచి ఉండాలంటే, మనమంతా సాంప్రదాయంగా పూజలు జరుపుకోవాలని, హిందువులంతా ఏకమై మన ఒక్క సాంప్రదాయ ఆచారాలు కాపాడుకోవాలంటూ, నిరంతరం జపాలు చేస్తుండాలంటూ, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మాట్లాడాడు.




