Banswada: పల్లె దవాఖానాలో ఎమ్మెల్యే పోచారం ఆకస్మిక తనిఖీ!
Banswada: బాన్సువాడ పాత పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.
Banswada: పల్లె దవాఖానాలో ఎమ్మెల్యే పోచారం ఆకస్మిక తనిఖీ!
బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆకస్మికంగా పాత బాన్సువాడ పల్లె దవాఖానను తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి .
దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేసిన పోచారం, ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.




