Banswada: బాన్సువాడలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, CMRF చెక్కుల పంపిణీ!

Banswada: బాన్సువాడలో 121 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 98 మందికి రూ.30.86 లక్షల CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పోచారం.

SALEEM, BANSWADA
Published on: 5 Sept 2026 3:35 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, CMRF చెక్కుల పంపిణీ!

Banswada: బాన్సువాడ పట్టణo లోని తన నివాసం వద్ద బాన్సువాడ నియోజకవర్గం వర్ని, చందూర్, మోస్రా మండలాలకు సంబంధించి 121 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, నియోజక వర్గంలోని 98 మంది ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 30,86,750/- ల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి.

బాన్సువాడ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

మండలాల వారిగా CMRF లబ్ధిదారుల వివరాలు. బాన్సువాడ పట్టణం 11 మంది CMRF లబ్ధిదారులకు రూ 3,40,000/-, బాన్సువాడ గ్రామీణ మండలం 13 మంది CMRF లబ్ధిదారులకు రూ 3,61,500/-, బీర్కూర్ మండలం 8 మంది CMRF లబ్ధిదారులకు రూ 2,54,000/-, నసురుల్లబాద్ మండలం 15 మంది CMRF లబ్దిదారులకు రూ 5,32,500/-, మోస్రా మండలం ఐదుగురు CMRF లబ్దిదారులకు రూ 90,500/-, చందూర్ మండలం ముగ్గురు CMRF లబ్దిదారులకు రూ 70,000/-, వర్ని మండలం 21 మంది CMRF లబ్దిదారులకు రూ 7,24,750/-, రుద్రుర్ మండలం 5 మంది CMRF లబ్దిదారులకు రూ 1,84,000/-, కోటగిరి మండలం నలుగురు CMRF లబ్దిదారులకు రూ 1,30,000/-, పోతంగల్ మండలం 11 మంది CMRF లబ్ధిదారులకు రూ 3,39,000/-.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story