Donkeshwar: ప్రజా క్షేత్రంలోనే అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే పైడి రాకేష్!
Donkeshwar: ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్‌లో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థల పరిశీలన చేశారు.
Donkeshwar: ప్రజా క్షేత్రంలోనే అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే పైడి రాకేష్!
డొంకేశ్వర్ న్యూస్: డొంకేశ్వర్ మండల్ డొంకేశ్వర్ గ్రామంలో నూతన ఎమ్మార్వో భవనం కోసం ఎమ్మెల్యే అధికారులతో పరిశీలన.ఈ సందర్భంగా నూతన ఎమ్మార్వో భవనం కోసం గ్రామపంచాయతీ ఆవరణలో సభ నిర్వహించారు,
అనంతరం అక్కడ ఉన్న గ్రామపంచాయతీ సిబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన SIR ఫామ్ గురించి అడిగి తెలుసుకున్నారు, వెంటనే పూర్తిగా పూర్తి కానీ వారి వి పూర్తి చేయండి, ఆలస్యం చేయకుండా ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండేలా చూడండి, దీనివల్ల భవిష్యత్ పొలిటికల్ వారికి చాలా ఉపయోగపడుతుందంటూ మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తో పాటు గ్రామ సర్పంచ్, ఎమ్మార్వో, ఎంపీడీవో హాజరయ్యారు.
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన ఎమ్మార్వో భవనం కోసం డొంకేశ్వర్ మండల ప్రజలకు, అన్ని రకాలుగా ఉపయోగముండేలా స్థలం పరిశీలించిన దాంట్లో ఏది గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు ఏది దగ్గరగా ఉంటుందో, అది ఆలోచించి నిర్మిద్దాం అంటూ అధికారులకు గ్రామ సర్పంచ్ తో సూచించారు , ఈ భవన నిర్మాణం కోసం సుమారు రెండున్నర కోట్లతో రూపాయలతో నిర్మించడం జరుగుతుంది, కావున సర్పంచ్, ప్రభుత్వ అధికారులు, ప్రజల యొక్క తీర్పు ఆలోచించి నిర్మించుకుందాం ప్రభుత్వ అధికారులతో కోరారు, త్వరగా ఆలోచించి ఎమ్మార్వో భవనం పనులు ప్రారంభిద్దాం అంటూ సర్పంచ్ అధికారులకు చెప్పడం జరిగింది,
ఈ భవనాన్ని ఆదర్శ భవనంగా తీర్చిద్దాం, ఇంకా ముందు ముందు దొంగేశ్వర్ మండల్ & గ్రామ అభివృద్ధి ఏ విషయమైనా ముందుంటానంటూ సర్పంచ్కు అధికారులకు హామీ ఇస్తూ, ఇకముందు మొదటిగా మళ్లీ మండలంలో తెలంగాణ మోడల్ స్కూల్ కోసం 15 కోట్ల నిధులతో మంచిగా ఆదర్శంగా నిర్మిద్దామని కోరారు. ఇది కేవలం రాజకీయాల పార్టీలకు అతీతంగా కాకుండా ప్రజల యొక్క తీర్పుకు ముందే వెళుతూ పనులు మొదలు పెడతామంటూ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎమ్మార్వో, ఎంపీడీవో, బిజెపి మండల అధ్యక్షుడు, డొంకేశ్వర్ బిజెపి మండల సర్పంచ్ లు, మండల బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




