Nizamabad: రైతు పక్షపాతిగా కాంగ్రెస్.. మద్దతు ధరతో పంట కొనుగోలు
Nizamabad: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఎల్లమ్మకుంటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Nizamabad: రైతు పక్షపాతిగా కాంగ్రెస్.. మద్దతు ధరతో పంట కొనుగోలు
Nizamabad: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగులు చేపడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏసీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తండాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలని చేతులెత్తేస్తే రాష్ట్రం రైతు పక్షపాతిగా వ్యవహరించి రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తుందని తెలిపారు.
మొత్తం 739 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేపడుతుండగా, అందులో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఐకేపీ వారికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చుక్క నీరందించనా దాఖలు లేవన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ.. పేదోళ్ల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు.




