Kamareddy: మద్నూర్‌లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన: సీపీఎస్ రద్దుకు డిమాండ్!
Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
Kamareddy: మద్నూర్‌లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన: సీపీఎస్ రద్దుకు డిమాండ్!
కామారెడ్డి: మద్నూర్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం మద్నూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు.
సీపీఎస్ విధానాన్ని రద్దుచేసిఓపీఎస్‌నుపునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న 11వపీఆర్‌సీని వెంటనే ప్రకటించి అమలుచేయాలని,ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలనికోరారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు రవికుమార్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్‌భద్రతకల్పించేలాసీపీఎస్‌నురద్దుచేసిఓపీఎస్‌నుపునరుద్ధరించాలని కోరారు.11 వ పీఆర్‌సీని వెంటనే ప్రకటించి అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సేవలు అందిస్తున్న ఉద్యోగులసమస్యలనుపరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంవహిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులన్యాయమైనడిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతేరాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతంచేస్తామనిహెచ్చరించారు.
ఈ నిరసనలో మద్నూర్ మండల నాయబ్ తహసీల్దార్లు ఖలీద్, శివరామకృష్ణ, గిర్దావర్ మురళీధర్, కార్యాలయ సిబ్బంది బాలరాజు, కావేరి, ప్రవీణ్, దశరథ్, జీపీఓల మండల అధ్యక్షుడు సత్యం, నాయకులు సంతోష్, బాబు, సురేష్, నర్సింలు, రంజిత్, సంగమ్మతో పాటు మండల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.




