Armoor: అవగాహన సదస్సులో ఖాళీ కుర్చీలు.. అధికారులకు షాక్ ఇచ్చిన ప్రజాప్రతినిధులు!
Armoor: ఆర్మూర్ రైతు వేదికలో నిర్వహించిన ప్రజా పాలన అవగాహన సదస్సుకు సర్పంచులు, కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు.
Armoor: అవగాహన సదస్సులో ఖాళీ కుర్చీలు.. అధికారులకు షాక్ ఇచ్చిన ప్రజాప్రతినిధులు!
అర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక భాగంగా సర్పంచుల - కౌన్సిలర్ల స్థాయి అవగాహన విద్య వారోత్సవాలు కార్యక్రమం పట్టణ రైతు వేదిక లో నిర్వహించారు. సర్పంచ్ - కౌన్సిలర్ల స్థాయి ఆవాగహన కార్యక్రమం: ఈ కార్యక్రమానికి సుమారు 5 మండల సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు అందరూ హాజరుకావాలని ఇన్విటేషన్ ద్వారా ఆహ్వానించారు అధికారులు, అలా ఆహ్వానించిన గాని పూర్తిస్థాయిలో హాజరుకాకుండా కేవలం 30% శాతం మెజార్టీ సర్పంచ్ కౌన్సిలర్ ఏ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన అధికారులు ఎక్కువ మెజార్టీ సర్పంచ్, కౌన్సిలర్ లు రాకపోవడంతో రైతు వేదికలు వేసిన ఎక్కడ కుర్చీలు అక్కడనే అలాగే మిగిలిపోయాయి, ఈ కార్యక్రమం ఇలా కావడంతో అధికారులు కు నిరాఆశ చోటు చేసుకుంది. ఇకనైనా వివిధ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన చో కంపల్సరీ 100 % మెజార్టీగా అందరూ రావాలని అధికారులు సూచించారు.
సర్పంచ్,కౌన్సిలర్లకు వసతలు :
ఈ కార్యక్రమంలో హాజరైన సర్పంచ్ కౌన్సిలర్లకు వేసవి దృశ్య ఎక్కువ ఉండడం తో సరైన వసతులు లేక ఇబ్బంది కి గురయ్యారు, కార్యక్రమం ప్రారంభమై,పూర్తి కావాలంటే మినిమం కొన్ని గంటలు పడుతుంది, అక్కడికి హాజరైన వారికి కుర్చీలలో కూర్చోవడానికి ఏర్పాటు చేశారు, ఒక ఐదు నిమిషాలు కార్యక్రమంలో కూర్చోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, కూలర్స్ లాంటివి ఏర్పాటు చేయని అధికారులు, మొత్తానికైతే ఈ కార్యక్రమం హాజరైన సర్పంచ్ కౌన్సిలర్లకు ఇబ్బందికరంగా ఏర్పడింది.
ఈ కార్యక్రమానికి నియోజవర్గ సర్పంచ్ కౌన్సిలర్ల తో పాటు ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు... వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఏడిఏ విజయలక్ష్మి, డిసిఓ శ్రీనివాసరావు లు తదితరులు పాల్గొన్నారు.




