Rudrur: రుద్రూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం.. 188 మందికి పరీక్షలు
Rudrur: బోధన్ లయన్స్ ఆసుపత్రి సహకారంతో రుద్రూర్‌లో ఉచిత వైద్య శిబిరం. 16 మందికి కంటి శుక్లాల గుర్తింపు. తహసీల్దార్ తారబాయికి పరీక్షలు.
Rudrur: రుద్రూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం.. 188 మందికి పరీక్షలు
రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనంలో గురువారం రోజు బోధన్ లయన్స్ జనరల్ ఆసుపత్రి మరియు లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. రుద్రూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం లో అపూర్వ స్పదన లభించింది.
ఈ శిబిరంలో ఎండి జనరల్ డాక్టర్, ఎంబిబిఎస్ డాక్టర్, ఆప్థోమలాజిస్ట్ ఆఫీసర్ మరియు ఆప్తోమెట్రిస్ట్ లచే వైద్య పరీక్షలు నిర్వహించారు రుద్రూర్ తహసీల్దార్ తారబాయి కి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరమైన సలహాలు అందించారు. అవసరమైన వారికి ఈసీజీ టెస్టులు, బీపీ టెస్ట్ లు, షుగర్ టెస్ట్ లు, ఉచితంగా నిర్వహించబడింది మరియు అవసరమైన వారికి మందులు మరియు కంటిచూక్కల మందులు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు మాట్లాడుతూ పేదల కు సేవ చేయడమే లయన్స్ లక్ష్యమని అన్నారు. అందుకు సహాయ సహకారాలు అందించిన లైన్స్ జనరల్ ఆసుపత్రి మరియు లైన్స్ కంటి ఆసుపత్రి వైద్యులకు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మాజీ లయన్స్ గవర్నర్ లయన్ పోలవరపు బసవేశ్వర రావు కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ శిబిరం లో 188 మంది రోగులు హాజరై చికిత్సలు చేసుకున్నారు ఇందులో 16 మందికి కంటి శుక్లాలు ఉండడం డాక్టర్లు గుర్తించి వారికి లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
లయన్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు అరుణ్ కుమార్ ఎండి ఫిజీషియన్, డాక్టర్ కృష్ణ ఎంబిబిఎస్, డాక్టర్ గణేష్ కుల్కర్ని ఎమ్మెస్ ఆప్తమాలజస్ట్ ఆఫీసర్, డాక్టర్ ప్రవీణ్ ఎండి డిసిహెచ్, కె అజయ్ ఆప్తోమెట్రిస్ట్ మరియు ఆసుపత్రుల సిబ్బంది లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్ జిల్లా జిఎస్టి కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడ్ జిల్లా అధ్యక్షులు లయన్ కెవి మోహన్, పుట్టి సాగర్, బోజుగొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.




