Kamareddy: జుక్కల్ మండలంలో చిరుత సంచారం వాహనదారులు తీవ్ర భయాందోళన!
Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోంగావ్-దోస్తపల్లి రహదారిపై చిరుతపులి సంచారం. వాహనదారులు వీడియో తీయగా, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Kamareddy: జుక్కల్ మండలంలో చిరుత సంచారం వాహనదారులు తీవ్ర భయాందోళన!
Kamareddy: జుక్కల్ (కామారెడ్డి ) జుక్కల్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. డోంగావ్, దోస్తపల్లి, బంగారు పల్లి గ్రామాల మధ్య రహదారిపై చిరుత కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
రహదారిపై కొంత దూరం సంచరించిన చిరుత అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుత కదలికలనుగమనించిన వాహనదారులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ప్రస్తుతం చిరుత సంచారానికి సంబంధించిన వీడియోస్థానికంగాచర్చనీయాంశంగా మారింది.జుక్కల్ నుంచిదోస్తపల్లి,బంగారు పల్లి,డోంగావ్, సోపూర్ గ్రామాల మీదుగా చిరుత కర్ణాటక ప్రాంతం వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనిఅటవీశాఖ,పోలీసుపోలీస్ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.




