Bodhan: వంద స్తంభాల గుడిని పునరుద్ధరించాలి న్యాయవాది అడ్లూరిశ్రీనివాస్

Bodhan: వంద స్తంభాల గుడి ఆలయాన్ని పునరుద్ధరించి పూజలు నిర్వహించాలని కోరుతూ ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షులు అడ్లూరి శ్రీనివాస్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

K RAVI, BODHAN
Published on: 8 Aug 2026 4:01 PM IST
Bodhan
X

Bodhan: వంద స్తంభాల గుడిని పునరుద్ధరించాలి న్యాయవాది అడ్లూరిశ్రీనివాస్

బోధన్ వంద స్తంభాల గుడిని పునరుద్ధరించి భక్తులకు పూజలు అందేలా చూడాలి..

ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ చేసిన ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షులు, న్యాయవాది అడ్లూరి శ్రీనివాస్

బోధన్: చారిత్రాత్మకమైన బోధన్ ఇంద్ర నారాయణ స్వామి ఆలయం (వంద స్తంభాల గుడి) ని ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించి, భక్తులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షులు, న్యాయవాది అడ్లూరి శ్రీనివాస్ ప్రభుత్వానికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

బోధన్పట్టణం లోని మహాలక్ష్మి ఆలయం లో శనివారం ఛత్రపతి శివాజీయువజన సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు అడ్లు రి శ్రీనివాస్ మాట్లాడు తు చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఇంద్ర నారాయణ స్వామి ఆలయాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.ఆలయానికి సంబంధించిన పురాతన శిల్పకళ, శిలా సంపద, నిర్మాణ అవశేషాలను సంరక్షించి, ఆలయాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆలయానికి 1 ఎకరం 20 గుంటల విస్తీర్ణం ఉన్నట్లు పేర్కొంటూ, ఆలయ పరిధిలోని స్థలాన్ని పరిరక్షించి, ఎటువంటి ఆక్రమణలు లేదా నిర్మాణాలకు అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆలయాన్ని ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని, ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి, నిర్వహణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మక కలిగిన దేవాలయాల శిల్పకళ, వాస్తుశిల్పం, హిందూ ధార్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ అంశంపై గత నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్, దేవాదాయ శాఖ కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, RDO, MRO, బోధన్ మున్సిపల్ కమిషనర్ తదితర సంబంధిత అధికారులకు లీగల్ నోటీసులు అందజేసినట్లు శ్రీనివాస్ వివరించారు.

ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి, చారిత్రాత్మక ఆలయ పరిరక్షణకు తక్షణమే చర్యలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోధన్ ప్రజలతో పాటు మెజారిటీ హిందూ భక్తుల మనోభావాలను ప్రభుత్వం గౌరవించి, ఆలయ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. భవిష్యత్ తరాలకు మన చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి” అని అడ్లూరి శ్రీనివాస్ అన్నారు.ఈసమావేశం లో

ధర్మపురి, అశోక్ గౌడ్, గోపి కిషన్, రాజులదేవి పవన్, పెర్కా వెంకటేష్, కందికట్ల వాసు, దుర్గా ప్రసాద్, గౌతమ్, బూమేష్, నిమ్మ శ్రీనివాస్, శివరాజ్, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story