Kamareddy: పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర!
Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్ద చెరువును ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు.
Kamareddy: పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పెద్ద చెరువును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ బృందంతో చెరువు వద్దకు చేరుకొని పర్యవేక్షించారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్ద చెరువులో భారీ వరద నీరు చేరడంతో పర్యటనకులు ప్రజలు చెరువు వద్ద చూడడానికి వస్తున్నారు.
దాంతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. చెరువు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండడంతో పెద్ద చెరువు వైపు పర్యటకులకు రాకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.
Next Story




