Khajapur: ఖాజాపూర్‌లో చిన్నారులకు పరిశుభ్రత, పోషకాహార అవగాహన

Khajapur: జగిత్యాల అగ్రికల్చర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఖాజాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ.

K RAVI, BODHAN
Published on: 11 Aug 2026 8:10 PM IST
Khajapur
X

Khajapur: ఖాజాపూర్‌లో చిన్నారులకు పరిశుభ్రత, పోషకాహార అవగాహన

ఖాజాపూర్: సాలుర మండలం ఖాజా పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో బి.ఎస్సీ అగ్రికల్చర్ జగిత్యాల విద్యార్థుల ఆధ్వర్యంలో పరిశుభ్రత, పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా చిన్నారులకుపరిసరాలపరిశుభ్రత పై అవగాహన కల్పించారు. భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవడం, గోళ్లు శుభ్రంగా ఉంచుకోవడం, రోజూ స్నానం చేయడం, జుట్టు సరిగా దువ్వుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.

పిల్లల ఆరోగ్యకర ఎదుగుదలకు సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, పాలు ప్రాముఖ్యతను తెలియజేశారు.ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.బి.ఎస్సీ అగ్రికల్చర్ జగిత్యాల విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్, తల్లిదండ్రులు, చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story