Jukkal: కౌలాస్ నాలా గేట్ల మరమ్మత్తులు.. దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్త!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ స్పిల్ వే గేట్ల మరమ్మత్తుల నిమిత్తం రేపు మధ్యాహ్నం నుంచి నీటిని విడుదల చేయనున్నారు.
Jukkal: కౌలాస్ నాలా గేట్ల మరమ్మత్తులు.. దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్త!
Jukkal: జుక్కల్ (కామారెడ్డి) జుక్కల్ మండలం కౌ లాస్ నాల ప్రాజెక్ట్ స్పిల్ వే గేట్ల మరమ్మత్తు పనుల నిమిత్తం రేపు (గురువారం ) మధ్యాహ్నం 1 గంటకు స్పిల్ వే గేట్ల ద్వార 100 క్యూసెక్కుల నీటిని కౌ లాస్ వాగులోకి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఎ ఇ అశ్వినీ ఒక ప్రకటన లో తెలిపారు. మూడు రోజుల పాటు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఆ తర్వాత అవసరమైన మేరకు 150 నుండి 200 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నీటి విడుదల సందర్భంగా నీటి ప్రవాహ ప్రాంతాలలో ఈత కొట్టడం, స్నానాలు చేసేందుకు గాను వెళ్లకూడదని సూచనలు చేశారు. నీటి ప్రవాహ ప్రాంతాలలో వాహనాలను ధరించరాదని, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు,జి పి ఓ లు,రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు ప్రజలకు సమాచారం అందించి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.




