Jukkal: కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద – ప్రజలకు అధికారుల హెచ్చరిక
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటిమట్టం 457.60 మీటర్లకు చేరింది. గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరిక.
Jukkal: కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద – ప్రజలకు అధికారుల హెచ్చరిక
జుక్కల్: ( కామారెడ్డి ) జుక్కల్ మండలం సావర్ గావ్ వద్ద గల కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటిమట్టం 457.60 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 458.00 మీటర్లు కాగా, ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరదప్రవాహాలు కొనసాగితే రానున్న 24 గంటల్లో లేదా ఒకటి రెండు రోజుల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నీటిమట్టం నిర్దేశిత స్థాయికి చేరితే వరద ప్రవాహాల పరిస్థితిని బట్టి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిగువ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులుసూచించారు.
రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పరివాహక ప్రాంత గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తంచేయాలనికోరారు.పశువులు,గొర్రెలుతదితరమూగజీవులు వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సూచించారు. అలాగే చేపలు పట్టేవారు, గొర్రెల కాపరులు, రైతులు, ప్రజలు వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
వరద గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే ముందు ప్రత్యేక హెచ్చరిక ప్రకటన జారీ చేస్తామనిఅధికారులుతెలిపారు. అందులో గేట్లు ఎత్తే సమయం, విడుదల చేసే నీటి పరిమాణం (డిశ్చార్జ్) వివరాలను ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరారు.




