Nizamsagar: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

VEERANNA, JUKKAL
Published on: 10 Sept 2026 9:59 PM IST
Nizamsagar
X

Nizamsagar: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

నిజాంసాగర్ (కామారెడ్డి ): నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.బాధితుల ఫిర్యాదులను పట్టభద్రతగా స్వీకరించి సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగంపాటించాలనిసూచించారు.

పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతినపరిష్కరించేందుకు చర్యలుతీసుకోవాలన్నారు.పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు వివరాలు, పెండింగ్ కేసులు, CCTNS నమోదు, సిబ్బంది పనితీరును ఎస్పీ పరిశీలించారు.మహిళలు, పిల్లలు, బాధితుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే పోలీస్ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాలు, ఊరేగింపుల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, రూరల్ సి ఐ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్‌హెచ్‌ఓతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story