Palvancha: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, మరో నలుగురికి గాయాలు

Palvancha: కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స.

MADHU, KAMAREDDY
Published on: 16 Sept 2026 6:55 PM IST
Palvancha
X

Palvancha: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, మరో నలుగురికి గాయాలు

పాల్వంచ: కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మకుంటకు చెందిన చిత్ర అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో నకిర్తి రాజు, సాత్విక్, హర్షిని, శంకరమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చుక్కాపూర్‌కు వెళ్లి తిరిగి కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు..

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY