Bichkunda: బిచ్కుంద మార్కండేయ మందిరంలో రక్షాబంధన్ వేడుకలు ఘనం!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మార్కండేయ మందిరంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Bichkunda: బిచ్కుంద మార్కండేయ మందిరంలో రక్షాబంధన్ వేడుకలు ఘనం!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయమందిరం–భారతమాత మందిరంలో రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణిమ వేడుకలను పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగాపద్మశాలీయులు పరస్పరం రక్షా బంధనాలు కట్టుకుని “నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా..మనమందరం కలిసి దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షా” అనే సందేశాన్ని చాటారు. అనంతరం జంధ్యాలను ధరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితమైన పండుగ కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, పరస్పర విశ్వాసం, ఐక్యత, సామాజిక బాధ్యతను పెంపొందించే పవిత్రమైన సంప్రదాయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
దేశం, ధర్మం, సమాజం పట్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మార్కండేయ మందిరం అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు హన్మండ్లు, పద్మశాలీ సంఘం డివిజన్ కార్యదర్శి డా. రాజు, మాలేగామ హన్మండ్లు, కోశాధికారి ప్రతాప్, షేర్ల బాలరాజు, మాలేగామ శ్రీనివాస్, రచ్చ శివకాంత్, భూమయ్య, వంగ నర్సింలు, షేర్ల లక్ష్మణ్, అంబటి బాలరాజ్, మాలేగాం గంగాధర్, బోడ అంజయ్య, వెంకటేశం, మెడికల్ గంగాధర్, లక్ష్మణ్ తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణిమ సందర్భంగా మందిర ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణం నెలకొంది. పరస్పరం రక్షలు కట్టుకుని ఐక్యతను చాటుతూ, దేశం, ధర్మం, సమాజం పట్ల తమబాధ్యతనుగుర్తుచేసుకుంటూకార్యక్రమాన్నివిజయవంతంగానిర్వహించారు.




