Jukkal: జుక్కల్ కేజీవీబీ విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ కేజీవీబీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసులు అందజేసిన సర్పంచ్ రమణ సురేష్ గొండ.

VEERANNA, JUKKAL
Published on: 5 Aug 2026 7:04 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ కేజీవీబీ విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

జుక్కల్: బస్వాపూర్ (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బ గాంధీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థినిలకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాస్లు, చెంచాలను అందజేశారు.

విద్యార్థినిల రోజువారీ బ్రేక్పాస్ట్, లంచ్, డిన్నర్ కు అవసరమైన సామాగ్రిలను అందజేశారు. అనంతరం ప్రతి విద్యార్థిని చేసదువును కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివి చదువులో మంచి ప్రతిభను కనపర్చాలని విద్యార్థినిలకు సూచించారు.

చదువును శ్రద్దగా చదివి కన్న తల్లితండ్రుల, విద్యను భోధించే ఉపాధ్యాయుల, పాఠశాల, కళాశాల ప్రతిష్టతను పెంచాలని ఈ సందర్బంగా విద్యార్థినిలకు పలు సూచనలు చేశారు.

కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ప్రత్యేక అధికారి హేమలత, పేరెంట్స్ కమిటి చైర్మన్, ఐకేపీ వి ఓ భాస్కర్, బస్వాపూర్ కారోబార్ గంగారాం, యదు మేస్త్రి లతోపాటు విద్యార్థినిలు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story