Pitlam: డీజిల్ కొట్టి నకిలీ నోటిచ్చిన వాహనదారుడు పరార్!
Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నకిలీ నోటు ఇచ్చి పరారైన మహారాష్ట్ర వాహనదారుడి కోసం పోలీసులు సీసీటీవీ ఆధారాలతో గాలిస్తున్నారు.
Pitlam: డీజిల్ కొట్టి నకిలీ నోటిచ్చిన వాహనదారుడు పరార్!
పిట్లం: పిట్లం మండల కేంద్రంలోని HP పెట్రోల్ బంక్ వద్ద బుధవారం నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ వార్త ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.ఓ వాహనదారుడు రూ.2 వేల విలువైన డీజిల్ పోయించుకుని, సిబ్బందికి నకిలీ కరెన్సీ నోటును అందించినట్లు సమాచారం.
నోటును పరిశీలించిన బంక్ సిబ్బంది అది నకిలీదిగా గుర్తించి అప్రమత్తమయ్యారు. వాహనదారుడినిఅడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా, అతడు అక్కడి నుంచి వాహనంతో పరారైనట్లు తెలుస్తోంది.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. అక్కడి CCTV కెమెరాల దృశ్యాలను పరిశీలించి, నిందితుడి వాహనానికి సంబంధించిన వివరాలను సేకరించారు.
ప్రాథమికంగా ఆ వాహనం మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, పరారైన వాహనదారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.దీనిపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.




