Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెట్రోల్ కరువు.. వాహనదారుల ఆందోళన!

Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్ మండలాల్లో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత.

VEERANNA, JUKKAL
Published on: 28 April 2026 1:42 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెట్రోల్ కరువు.. వాహనదారుల ఆందోళన!

కామారెడ్డి: జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్ మండల కేంద్రాల్లోని పెట్రోల్ బంకు లో ఇంధన కొరత కారణంగా బంకు యజమానులు బంకు ల ముందు వాహనాలు రాకుండా అడ్డంగా డబ్బా లు పెట్టడంతో ఇంధనం కోసం వచ్చిన వాహనదారులు వెనుదిరిగి వెళ్తున్నారు. పిట్లం మండల కేంద్రంలో 4 బంకు లు ఉండగా ఒక బంకు లో మాత్రమే ఇంధనం నిల్వ ఉండడంతో వాహనదారులు ఒకేసారి వచ్చి ట్యాంక్ పుల్ చేసుకోవడంతో ఇంధన కొరత ఏర్పడిందని బంకు యజమానులు తెలిపారు.

తమ బంకు లో ఇంధన నిల్వ కోసం ముందస్తుగా రెండు రోజుల ముందు డి డి లు కట్టిన డిపో వారు సకాలంలో ఇంధనం సరఫరా చేయకపోవడంతో ఇంధన కొరత ఏర్పడిందని ప్రతి బంకు కు ఇంధనం సరఫరా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని బంకు యజమానులు తెలిపారు. బంకు లో ఉన్న ఇంధనం పూర్తిగా డ్రై అయ్యేవరకు డిపో వారు ఇంధనం సరఫరా చేయడం లేదని ఇంధనం కోసం డి డి లు కట్టి డిపోల వద్ద తమ వాహనాలు ఉన్న అక్కడ రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story