Jukkal: కౌలాస్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసిన సర్పంచ్ ఎంబరీ విద్య బలరాం.

VEERANNA, JUKKAL
Published on: 23 July 2026 8:02 PM IST
Jukkal
X

Jukkal: కౌలాస్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

జుక్కల్: కౌలాస్ (కామారెడ్డి) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు గురువారం గ్రామ సర్పంచ్ ఎంబరీ విద్య బలరాం, ఉప సర్పంచ్ పూజారి గణేశ్ ల చేతుల మీదుగా నోట్ పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను పంపిణి చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన సామాగ్రిని అందిస్తూ ప్రతి విద్యార్థి చదువును శ్రద్ధగా చదివి తల్లితండ్రుల ఆశయాలను, ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ పవన్ మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన వస్తువులను అందించేందుకు ముందుకు వచ్చి ప్రతి విద్యార్థికి నోట్ పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు చెంచాలను అందించడం అభినందించదగ్గ విషయమని ఇలాంటి సేవా కార్యక్రమాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

కార్యక్రమం లో కౌ లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదగిరి, ఎంబారీ రాకేష్, వార్డు సభ్యుడు జయరాం తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు కావలసిన నోట్ పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను పంపిణి చేయడంపై స్థానికులు అభినందిస్తూ , విద్యార్థుల సంక్షేమానికి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story