Kamareddy: సరంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శనివారం ప్రారంభించారు.

MADHU, KAMAREDDY
Published on: 5 Sept 2026 12:46 PM IST
Kamareddy
X

Kamareddy: సరంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 6వ వార్డు పరిధిలోని సరంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ శనివారం ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సొంతిల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల కుటుంబాల్లో ఎల్లప్పుడూ సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఛైర్పర్సన్ సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నిట్టు గంగాధర్, నాయకులు రాకేష్ ,గోపి ,లింగం ,నాగరాజు, శ్రీనివాస్ ఇందిరమ్మ లబ్ధిదారులు మామిళ్ళ అనసూయ ముత్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story