Kamareddy: మద్నూర్ మండలంలో దొంగల బీభత్సం ఒకే గ్రామంలో 4 ఇళ్లలో చోరీ!
Kamareddy: కామారెడ్డి జిల్లా మెనూర్ గ్రామంలో వరుస చోరీలు. 4 ఇళ్ల తాళాలు పగలగొట్టి 25.8 తులాల బంగారం, 84 తులాల వెండి, రూ.1.78 లక్షల నగదు అపహరణ.
Kamareddy: మద్నూర్ మండలంలో దొంగల బీభత్సం ఒకే గ్రామంలో 4 ఇళ్లలో చోరీ!
Kamareddy: మెనూర్ (కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. మెనూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లను దుండగులు టార్గెట్ చేసి.. భారీగా బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు.
వరుసగా చోరీలు జరుగుతున్నా.. పోలీసుల నిఘా ఏమైందంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో గస్తీ పెంచకపోవడం వల్లే దొంగలకు భయం లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే చోరీలకు ఊతమిస్తోందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లకు కళ్లెం వేస్తున్న దొంగలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు.
మెనూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు.. తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ వరుస చోరీల్లో సుమారు 25.8 తులాల బంగారం, 84 తులాల వెండి, రూ.1.78 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు.
వరుస చోరీలతో గ్రామస్తులు భయాందోళనకుగురవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఇళ్లలోచోరీలుజరుగుతున్నా పోలీసుల నిఘా ఎందుకు కనిపించడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గ్రామాల్లో రాత్రివేళ పోలీసుల గస్తీ పెంచాలని.. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలుఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
చోరీలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేయడం కంటే చోరీలు జరగకుండా ముందస్తు నిఘా ఎందుకు పెట్టడం లేదని పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టపగలు కూడా ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇకనైనా పోలీసులు స్పందించి గ్రామాల్లో గస్తీ పెంచి దొంగల ఆట కట్టించాలనికోరుతున్నారు. చోరీ పై సమాచారంఅందుకున్న మద్నూర్ పోలీస్ లు ఘటనాస్థలాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు దర్యాప్తుకొనసాగిస్తున్నారు. వరుస చోరీలతో మెనూర్ గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది.
పోలీసుల నిఘా వైఫల్యంపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికైనా గస్తీ పెంచి దొంగల భరతం పట్టాలనిడిమాండ్ చేస్తున్నారు.




