Kamareddy: ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన!
Kamareddy: కామారెడ్డి అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ప్రతిపాదిత ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ స్థానికులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Kamareddy: ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన!
Kamareddy: ప్రతిపాదిత ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అశోక్ నగర్ కాలనీ వద్ద రైల్వే గేటు 209/A వద్ద నిర్మించనున్న ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ.. కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, లోలం శ్రీనివాస్, యాడారం ప్రియాంక ఆధ్వర్యంలో అశోక్ నగర్, స్నేహపురి, కే.పీ.ఆర్ కాలనీలకు చెందిన వందలాది మంది కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరికి వినతిపత్రం అందజేశారు.
గత 30 నుంచి 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని.. బ్రిడ్జి నిర్మాణంతో తమ ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో దాదాపు 300 మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే సర్వే, మార్కింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆందోళన నెలకొందన్నారు.
నివాసాలకు నష్టం కలగకుండా ఖాళీ స్థలం నుంచి బ్రిడ్జి నిర్మించేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ వినతిపత్రం ప్రతులను ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కూడా అందజేయనున్నట్లు తెలిపారు.




