Shakthi Nagar: వర్షాకాల సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

Shakthi Nagar: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం శక్తి నగర్‌లో వైద్యారోగ్య శాఖ, పల్లె దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Aug 2026 9:55 PM IST
Shakthi Nagar
X

Shakthi Nagar: వర్షాకాల సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

శక్తి నగర్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జుక్కల్ మండలం డోన్‌గావ్ గ్రామ పంచాయతీ పరిధిలో ని శక్తి నగర్ గ్రామం లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా పల్లె దవాఖాన వైద్య బృందం ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేసింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని వినియోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.ఈ వైద్య శిబిరన్ని డోన్ గావ్ గ్రామ పంచాయతీ పరిధిలో ని శక్తి నగర్, శక్తి నగర్ తాండ వాసులు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు.

శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యులు మాధవ్, డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్త సంగీత, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, రోగులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story