Jukkal: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టలేరు: కాంగ్రెస్ నేతలు!

Jukkal: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేపడుతున్న పాదయాత్ర రాజకీయ డ్రామా అని, 15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Aug 2026 9:39 PM IST
Jukkal
X

Jukkal: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టలేరు: కాంగ్రెస్ నేతలు!

జుక్కల్: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేపడుతున్న పాదయాత్రలపై మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకోని షిండేకు ఇప్పుడు పాదయాత్రలు ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న సమయంలో రోడ్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంవల్లేనియోజకవర్గంలోనిఅనేకరహదారులుగుంతలమయమయ్యాయనిఆరోపించారు.మోకాళ్లపై నడిచినా ప్రజల తీర్పును మార్చలేరని, గత పాలనను జుక్కల్ ప్రజలు మర్చిపోలేదని కాంగ్రెస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు రోడ్ల దుస్థితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో స్పందించని వారు, ఇప్పుడు అదే రోడ్ల పేరుతో పాదయాత్రలు చేయడం రాజకీయ డ్రామా తప్ప మరొకటి కాదన్నారు.

ప్రస్తుత జుక్కల్ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బాధ్యతలు చేపట్టినతర్వాతనియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని నాయకులు పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చిపనులుచేపడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో సి సి రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.“అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు.

ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు” అంటూ హన్మంత్ షిండేపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 15 ఏళ్ల పాలనలో ఎన్ని రోడ్లు అభివృద్ధి చేశారో, ఎన్ని గ్రామాలకు శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పాదయాత్రలు కాదు.. అభివృద్ధి కావాలి. ప్రచారం కాదు.. పని కావాలి. మాటలు కాదు.. ఫలితాలు కావాలి అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. జుక్కల్ ప్రజలకు ఎవరు పనిచేస్తున్నారో, ఎవరి పాలనలో అభివృద్ధి జరుగుతుందో స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు.

సమావేశంలో జుక్కల్ మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్, జుక్కల్ సొసైటీ చైర్మన్ ఎన్. శివానంద్, మద్నూర్ మార్కెట్ కమిటి మాజి చైర్మన్ కె. సాయాగౌడ్ ,మార్కెట్ కమిటి చైర్మన్ భర్త అయిల్వర్ రమేష్, ఖండే బల్లూరు సర్పంచ్ చాకలి కృష్ణ, అశోక్ రెడ్డి, అనిల్,గంగు నాయక్, మనోహర్, బస్వారాజ్, సురేష్ గోండా, సంతోష్ అప్ప, బొంపెల్లి రాజులు సెట్ తో పాటు పలువురు జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story