Kamareddy: పవన్ బర్త్‌డే వేడుకలు.. రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు!
Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనసేన నాయకుడు కంచర్ల నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, రక్తం పంపిణీ.
Kamareddy: పవన్ బర్త్‌డే వేడుకలు.. రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు!
Kamareddy: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు కంచర్ల నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉగ్రవాయి గ్రామ శివారులోని బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కామారెడ్డిలోని రెయిన్బో బ్లడ్ సెంటర్‌లో జనసేన నాయకులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పత్రి శంకర్, ఆశయాల స్వామి, సంగి రవి, మలయాళ ప్రభాకర్, రాజంపేట మండలానికి చెందిన బద్రి స్వామి, కుంబాజి నరేష్, కోతి బాలరాజ్, సాయిరాజ్, రజనీకాంత్ తదితరులు రక్తదానం చేశారు.
మధ్యాహ్నం పులిహోర ప్యాకెట్ల పంపిణీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.




