Kamareddy: కామారెడ్డి విద్యుత్ SE కార్యాలయం ఎదుట రైతుల ధర్నా!
Kamareddy: కామారెడ్డి విద్యుత్ SE ఆఫీస్ ముందు భారతీయ కిసాన్ సంఘ్ ధర్నా. పంటలకు 18 గంటల విద్యుత్ అందించాలని రైతుల డిమాండ్.
Kamareddy: కామారెడ్డి విద్యుత్ SE కార్యాలయం ఎదుట రైతుల ధర్నా!
Kamareddy: కామారెడ్డి విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి అవసరమైన మేర నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు 18 గంటల విద్యుత్ అందించాలని కోరారు. విద్యుత్ సమస్యపై ఇప్పటికే ఎస్‌ఈని కలిసి వినతిపత్రం అందించినా స్పందన రాలేదని కిసాన్ సంఘ్ నాయకులు తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు, కిసాన్ సంఘ్ సభ్యులు పాల్గొని విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




